SGSTV NEWS
Spiritual

నవరాత్రుల్లో ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. దుర్గాదేవి, శనీశ్వరుడి ఆశీస్సులు మీ సొంతం



ఆశ్వయుజ మాసం లో వచ్చే నవరాత్రులను దేవీ నవరాత్రులు, శరదీయ నవరాత్రులు అని అంటారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఈ సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. కనుక ఈ సమయంలో కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే.. అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. కనుక ఆ వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.


ఈ సంవత్సరం శారదీయ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తాయి. అమ్మవారి అనుగ్రహం కోసం నవరాత్రి సమయంలో భక్తులు గుర్తుంచుకోవలసిన కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.. ఈ వాస్తు టిప్స్ ఇంట్లో సానుకూలతను కాపాడతాయి. ఆనందం, శ్రేయస్సును తెస్తాయి. అంతేకాదు శని దేవుడి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. అనేక ఇబ్బందులను తగ్గిస్తాయి.

ఇంట్లో ఈ మూలను శుభ్రంగా ఉంచండి
అమ్మవారిని ఇంట్లో ప్రతిష్టించక ముందే ఇంటిని, పూజ గదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య దిశతో పాటు.. ఇంటి నైరుతి దిశ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వాస్తు శాస్త్రంలో ఈ దిశకు శనీశ్వరుడు అధిపతిగా పరిగణిస్తారు.

కనుక ఈ దిశకు సంబంధించిన వాస్తు నియమాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంటి నైరుతి మూలలో విరిగిన లేదా బరువైన వస్తువులను ఉంచవద్దు. ఈ స్థలంలో నగలు, ముఖ్యమైన పత్రాలను కూడా ఉంచవచ్చు.

ప్రధాన ద్వారం కోసం వాస్తు నియమాలు
వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎందుకంటే ఈ ద్వారం ద్వారానే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కనుక ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రధాన ద్వారం దగ్గర పొరపాటున కూడా చెత్తబుట్టలు లేదా చీపుర్లు ఉంచవద్దు.

అంతేకాదు ఈ ప్రధాన ద్వారం తెరిచే సమయంలో ఎటువంటి శబ్దం లేకుండా ఉండేలా చూసుకోవాలి. నవరాత్రి సమయంలో సాయంత్రం వేళల్లో ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించవచ్చు, ఇది మీ ఇంటికి ఆనందం , శ్రేయస్సును తెస్తుంది. ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది.

ఈ పని తప్పకుండా చేయండి


నవరాత్రులలో అఖండ జ్యోతిని వెలిగిస్తున్నట్లయితే వాస్తు ప్రకారం..దానిని ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. అంతేకాదు ఈ నవరాత్రి సమయంలో ప్రతికూలతను తొలగించేందుకు సాయంత్రం ఇంటి నాలుగు మూలల్లో దీపాలను వెలిగించవచ్చు.

నవరాత్రులు ప్రారంభానికంటే ముందుగానే ఇంట్లో ఉపయోగించని ఏవైనా వస్తువులు ఉంతే తీసివేయాలి. ఎందుకంటే ఈ వస్తువులు ప్రతికూల శక్తిని పెంచుతాయి. నవరాత్రి సమయంలో అవసరమైన వారికి నల్ల నువ్వులు, ఆహారం , మినపప్పు దానం చేయండి.. ఇలా చేయడం వలన అమ్మవారి ఆశీస్సులతో పాటు శనీశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి.

Related posts

Share this