SGSTV NEWS
CrimeTelangana

మూసీలో బట్టలు లేకుండా మహిళ డెడ్‌ బాడీ.. అంతు చిక్కని మిస్టరీగా మర్డర్ కేసు!



రాజేంద్రనగర్ కిస్మత్ పూర్‌లో మహిళ డెడ్ బాడీ కలకలం. గుర్తు తెలియని మహిళలను హత్య చేసిన దుండగులు. ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం. మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు స్వేకరిస్తున్నాయి. కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళలను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు..


హైదరాబాద్, సెప్టెంబర్‌ 16: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్ పూర్‌లో దారుణ హత్య జరిగింది. 3 రోజుల క్రితం మహిళను హత్య చేసి మూసి నదిలో పడేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో.. మహిళ మృతదేహంగా గుర్తించారు. మహిళా ఒంటిపై దుస్తులు లేకపోవడంతో హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ హత్యకు గల కారణాలపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతి త్వరలోనే ఈ హత్యకు గల నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు.

రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్ పురా డెడ్ బాడీని చూసి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనస్థలికి చేరుకున్నాం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించాము. డెడ్ బాడీని మహిళా డెడ్ బాడీగా గుర్తించాం. ఎక్కడో హత్య చేసి కిస్మత్ పురలో పడవేసినట్టుగా అనుమానిస్తున్నాం. డెడ్ బాడీ కుళ్ళిన స్థితిలో ఉంది. హత్య జరిగి రెండు మూడు రోజులు అయి ఉండవచ్చు. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాలలోపు ఉంటుందని భావిస్తున్నాం. డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి వెరిఫై చేస్తున్నాం. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నాం. స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నాం. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తాం. ఘటనా స్థలంలో క్లూస్, అలానే ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నాం. మృతురాలు ఎవరు.. ఆమెను హత్య చేసింది అన్నది ఎవరు? అన్నది త్వరలోనే తేలుస్తామని వెల్లడించారు.

రేప్ అండ్ మర్డర్‌..?
మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు స్వేకరిస్తున్నాయి. కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళలను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.. స్థానిక పరిసరాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

Also read

Related posts

Share this