SGSTV NEWS
Andhra PradeshCrime

Bhashyam School: అల్లరి చేస్తోందని చిన్నారి తలపగలగొట్టిన కొట్టిన టీచర్..


అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై చితకబాదింది టీచర్. దీంతో బాలిక పుర్రె ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే .. చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్లో నాగశ్రీ అనే విద్యార్థిని ఆరవ తరగతి చదువుతోంది.

Bhashyam School: స్టూడెంట్స్ అన్న తర్వాత స్కూల్ ల్లో అల్లరి చేయడం, హోమ్ వర్క్ చేయకుండా టీచర్లను విసిగించడం సహజం. అలా అని పిల్లల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించడం దారుణం! ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని  ఓ ప్రైవేట్ పాఠశాలలో సరిగ్గా  ఇలాంటి ఘటనే జరిగింది. క్లాస్ రూంలో అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై చితకబాదింది టీచర్. దీంతో బాలిక పుర్రె ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే .. చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్లో నాగశ్రీ అనే విద్యార్థిని ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 10న నాగశ్రీ క్లాస్ రూమ్ లో అల్లరి చేసిందని సలీంభాషా అనే ఉపాద్యాయుడు బాలిక తలపై బ్యాగ్ తో బలంగా కొట్టాడు. ఆ తర్వాత స్కూల్ నుంచి  ఇంటికి వెళ్లిన ఆ బాలిక తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరోచనాలు అంటూ అల్లాడిపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పుర్రె ఎముక విరిగింది..
దీంతో ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు దెబ్బ బలంగా తగలడంతో పుర్రె ఎముక విరిగినట్లుగా తెలిపారు. హెడ్ స్కానింగ్ చేయగా.. పుర్రె సొట్టపడినట్లుగా కనిపించింది. ఫై వీడియో చూస్తే మీకు ఎక్స్ రేలో ఏముందో మీరు కూడా చూడొచ్చు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు టీచర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బిడ్డను ఆ పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.  లక్షలు, లక్షలు ఫీజులు కట్టి పిల్లల్ని స్కూళ్లకు పంపేది చంపుకోవడానికా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తే బుద్ధి చెప్పాలి, లేదా మాటలతో భయపెట్టాలి.. అంతేకాని ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని టీచర్ పై మండిపడుతున్నారు

Also read

Related posts

Share this