SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: క్షుద్ర పూజలకు వ్యతిరేకంగా ఒక్కటైన గ్రామస్తులు.. ఏం చేశారో తెలుసా..?

 

చంద్రగ్రహణం మొదలైన సమయం నుంచి గుంటూరు సమీపంలోని రెడ్డి పాలెం శివాలయం వద్ద ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. నెల రోజుల నుండి శివాలయం వద్దే తిష్ట వేసిన అఘోర.. అక్కడే మరొక అఘోరితో కలిసి.. తలపై నిప్పుల కుంపటితో పెద్ద ఎత్తున పూజలు చేశారు.


చంద్రగ్రహణం మొదలైన సమయం నుంచి గుంటూరు సమీపంలోని రెడ్డి పాలెం శివాలయం వద్ద ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. నెల రోజుల నుండి శివాలయం వద్దే తిష్ట వేసిన అఘోర.. అక్కడే మరొక అఘోరితో కలిసి పెద్ద ఎత్తున పూజలు చేశారు. తలపై నిప్పుల కుంపటి పెట్టుకున్న వీరిద్దరూ గ్రహణం వీడే వరకూ పూజలు చేశారు. అయితే అర్థరాత్రి సమయంలో వీరిద్దరూ చేసిన పూజలు చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రహణం రోజున అన్ని ఆలయాలు మూసి ఉంటే తమ ఆలయం ఎందుకు తీసి ఉందో వారికి అర్థం కాలేదు. ఏం పూజలు చేశారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అఘోర చేసిన పూజలు క్షుద్ర పూజలే అన్న భావనకు స్థానికులు వచ్చారు.


మరుసటి రోజు అఘెర శ్రీనివాసరావు, అఘోరి శాలిని.. ఇద్దరి దగ్గరకు వెళ్లి గ్రామస్థులు నిలదీశారు. తమ గ్రామం నుండి వెళ్ళిపోయాలని డిమాండ్ చేశారు. స్థానికులంతా ఒక్కసారిగా తిరగబడటంతో అఘోరి, అఘోరా అక్కడ నుండి బిఛానా ఎత్తేశారు. అయితే గ్రహణ సమయంలో వశీకరణ పూజలు చేశాడన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలి..? గ్రామానికి, గ్రామస్థులకు నష్టం జరగకుండా ఏం చేయాలో చెప్పాలంటూ వేద పండితులను ఆశ్రయించారు.

కష్ట, నష్టాలు దరిచేరకుండా ఉండాలంటే శున్నల పన్నం పారాయణ చేయాలని పండితుల సూచనలు చేశారు.. ఆ తర్వాత శివుడికి శతకటాభిషేకం చేయాలని సూచించారు. ఆరుద్ర నక్షత్రం రోజున ఈ పూజలు చేస్తే భూతప్రేత దోషములు తొలగిపోతాయన్నారు. దీనిపై గ్రామంలో చర్చ జరిగింది. వేద పండితుల సూచనలు మేరకు పూజలు నిర్వహించారు. ఊరంతా ఒక్కటై ఇంటికొ బిందె చొప్పున నీళ్ళు తీసుకొచ్చి శివలింగానికి శతకటాభిషేకం చేశారు. ఇక తమ ఊరికి అఘోర పూజలతో పట్టిన అరిష్టం తొలగిపోతుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

Also read

Related posts

Share this