SGSTV NEWS online
CrimeTelangana

Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య గొంతు కోసిన భర్త



ఎల్బీనగర్ : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన మహాలక్ష్మి (19), వేణుగోపాలు పెద్దల సమక్షంలో గతేడాది ఆగస్టులో వివాహం జరిగింది. తాగుడుకు బానిసగా మారి భార్య బంగారు నగలను అమ్ముకున్నాడు. కొంత బంగారాన్ని ఆమె పుట్టింట్లో దాచగా.. వాటిని తెమ్మని భార్యను వేధిస్తున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వేణుగోపాలు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినా అతడి తీరు మారలేదు. ఆదివారం బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి వెళదామని భార్య కోరగా ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో బ్లేడు తీసుకొని ఆమె గొంతు కోశాడు. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. నిందితుడు వేణుగోపాల్ను నాగోల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also read

Related posts