SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: అయ్యో దేవుడా.. ప్రాణ స్నేహితులను మింగేసిన మేఘాద్రి గెడ్డ..! చెప్పు కోసం వెళ్లి..

ఈ విషాదం తీరనిది..! ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఇద్దరు స్నేహితులు.. మరణంలోనూ ఆ బంధం వీడలేదు. సరదాగా విహారానికి వెళ్లిన ఆ ఇద్దరిని.. మేఘాద్రి గెడ్డ మింగేసింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెందుర్తి జేన్ఎన్ఎన్ఎయూఆర్ఎం కాలనీకి చెందిన బల్లంకి శేఖర్, చినముషిడివాడ ఆక్సిజన్ కాలనీకి చెందిన చెందిన యాడాడ లక్ష్మణ్ ప్రాణ స్నేహితులు.. తన సోదరుడు వాసుతో కలిసి శేఖర్, లక్ష్మణ్ మేహాద్రిగెడ్డకు వెళ్లారు. లక్ష్మణ్.. ఒడ్డున కూర్చుని చెప్పులు నీటిలోకి విసురుతూ ఆడుతున్నాడు.


ఈ క్రమంలో ఆ చెప్పు నీటిలో పడి లోపలికి వెళ్లడంతో దాన్ని తీసేందుకు దిగాడు శేఖర్.. ఈ క్రమంలో నాచు కారణంగా జారి.. శేఖర్ నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో లక్ష్మణ్ కూడా నీటిలో జారిపోయాడు. అక్కడే ఉన్న శేఖర్ అన్న వాసు.. వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. వాసు కూడా నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనను చూసిన సమీపంలోని ఓ వ్యక్తి.. కాపాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే వాసు చెయ్యి జారిపోవడంతో శేఖర్, లక్ష్మణ్ ఇద్దరూ రిజర్వాయర్‌లో మునిగిపోయారు. వాసు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ సతీష్ హుటాహుటిన తన బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి రిజర్వాయర్‌లో గాలించారు. గల్లంతైన శేఖర్, లక్ష్మణ్ ఆచూకీ లభించినప్పటికీ అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Also read

Related posts

Share this