SGSTV NEWS
CrimeTelangana

Kukatpally murder case: కూకట్‌పల్లి రేణు మర్డర్‌ కేసును మలుపు తిప్పిన క్యాబ్ డ్రైవర్.. ఇద్దరు నిందితులు అరెస్ట్‌



కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పావులు కదిపిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే కేసు మొత్తం కొలిక్కి తీసుకువచ్చారు. అసలేం జరిగిందంటే..


హైదరాబాద్, సెప్టెంబర్‌ 13: కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చెందించారు. నిందితులు ఇద్దరినీ రాంచీలో కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు ముందు మెదక్ తుప్రాన్‌లో ఒక ఫాం హౌస్ లో హర్ష గ్యాంగ్ పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో మొత్తం 9 మందిని గుర్తించిన పోలీసులు. ఇందులో నిఖిల్ అనే వ్యక్తిని ఢిల్లీ ఫరిధాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. ఇక క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మొత్తం కేసును ఛేదించారు. హైదరాబాద్ లో కొండాపూర్ నుంచి రాంచీ క్యాబ్ బుక్ చేసుకున్న హర్ష.. సంఘటన జరిగిన రోజే బయల్దేరారు. రాంచీలో వాళ్ళను డ్రాప్ చేసి వస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


అసలేం జరిగిందంటే?
కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సాన్వీ లేక్‌ అపార్ట్‌మెంట్‌లో 1311 ప్లాట్‌లో రాకేష్‌ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్‌కు సనత్‌నగర్‌లో స్టీల్‌ షాప్‌ ఉంది. వారి ఇంట్లో పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తి పనికి కుదిరాడు. ఎంతో నమ్మకస్తుడి మాదిరి యజమానులను నమ్మించిన హర్ష అదును కోసం ఎదురు చూశాడు. బుధవారం భర్త రాకేష్‌, కుమారుడు షాప్‌కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంది. ఇక సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటం చూసి ఫోన్‌ చేశాడు. ఫోన్‌ను ఎవరూ లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్‌ సహాయంలో తలుపులు తెరిచి చూడగా.. రేణు రక్తం మడుగులో పడి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్‌తో తలపై, కత్తితో 20 సార్లు పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. హర్షతోపాటు అదే అపార్ట్‌మెంట్‌లో బంధువుల ఇంట్లో పనికి కుదిరిన రోషన్ అనే వ్యక్తి.. వీరిద్దరూ కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. హత్య అనంతరం నిందితులు ఇద్దరూ రక్తంతో తడిసిన దుస్తులను అక్కడే వదిలేసి, స్నానం చేసి స్కూటీపై పరారైనట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. రేణు హత్య తర్వాత ఆమె ఒంటిపై 5 తులాల బంగారం, రూ.50 వేల నగదుతో నిందితులు పరారయ్యారు. హత్య సమయంలో రేణు కేకలు వేయకుండా ఉండేందుకు ఆమె గొంతులో కత్తెరతో పొడిచి ఆపై దారుణానికి పాల్పడ్డారు

Also read

Related posts

Share this