SGSTV NEWS
CrimeTelangana

Viral: దొంగతనం జరిగిందని పోలీస్ కంప్లయింట్.. కట్ చేస్తే.. సీసీటీవీలో వెలుగులోకి షాకింగ్ నిజం



దొంగతనం జరిగిందని ఓ వ్యక్తీ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇవ్వగా.. పోలీసులు విచారణ చేశారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అందులో షాకింగ్ విషయం బయటపడింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఓసారి లుక్కేయండి.

మేడ్చల్ జిల్లా సూరారం పి.యస్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో‌ ఓ పాత నేరస్థుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 55.95 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఈ నెల 4వ తేదీన సూరారం కాలనీ దుర్గామాత ఆలయం సమీపంలో ఉండే కొట అనీల్ కుమార్ తన ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశాడు. అతడు ఇచ్చిన కంప్లయింట్ మేరకు దర్యాప్తు ప్రారంభించారు సూరారం పోలీసులు.

దొంగతనం జరిగిన ప్రదేశం నుంచి సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారములను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పదంగా తిరుగుతూ ఆ నగలను అమ్మడానికి ప్రయత్నిస్తున్న అంబటి విజయ్ కుమార్, సూరారం కాలనీ నివాసిని అదుపులోకి తీసుకుని అతని జేబులో ఉన్న జిప్క్ కవర్లో బంగారు నగలు చూసి తమదైన శైలిలో విచారించగా, తాను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇతను గతంలో 2017లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో Cr. No.102/2017 నిందితుడు అని తేలింది. నిందితుడు అంబటి విజయ్ కుమార్ నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించని మేడ్చల్ ఏ.సి.పి శంకర్ రెడ్డి తెలిపారు.

Also read

Related posts

Share this