SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..


ఏపీలోని విశాఖపట్నం హైటెక్‌ వ్యభిచారానికి కేంద్రంగా మారిపోయింది. స్పా సెంటర్ల ముసుగులో గలీజు వ్యవహారం సాగుతోంది. మసాజ్ సెంటర్ల మాటున వ్యభిచారం నడుస్తోంది. స్పా సెంటర్ల పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేంద్రాలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. గత వారంలో వరుసగా రెండు స్పా సెంటర్లపై చేసిన దాడుల్లో వారి మసాజ్‌ బాగోతం బయటపడింది.


వైజాగ్ NDA జంక్షన్ లోని స్పా సెంటర్ పై టాస్క్ ఫోర్స్ దాడులు చేయగా.. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఎలైట్ స్పా లో తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు.. ముగ్గురు మహిళలను.. ముగ్గురు విటులు, స్పా నిర్వాహకుడిని అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారానే 80 శాతం హైటెక్‌ వ్యభిచారం నడుస్తున్నట్లు తెలుస్తోంది.



సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో డిజిటల్‌ యాడ్స్‌ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. సాధారణ మసాజ్‌లకు రూ.1000 నుంచి రూ.2500 ఛార్జ్‌ చేస్తున్నారు. వ్యక్తిగత సేవలు కావాలంటే రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు.

Also read

Related posts

Share this