నెల్లూరు జిల్లా మూలపేటలోని అలంకార్ సెంటర్ వద్ద నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చంపారు. మృతుడు లైక్ ఓమహిళను వేధిస్తున్నాడని.. ఈ వేధింపుల కారణంగానే ఈ అఘాయిత్యం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు
నేటి కాలంలో మహిళలపై వేధింపులు తీవ్రమైన సమస్యగా మారాయి. ఇవి కేవలం శారీరక హింసకే పరిమితం కాకుండా మానసికంగా, మాటల రూపంలో కూడా ఉంటాయి. ఈ వేధింపులు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వారి భద్రతకు ముప్పుగా మారతాయి. పనిచేసే చోట, బయట, ఆన్‌లైన్‌లో ఇలా ఎక్కడైనా వేధింపులకు గురవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీటిని ఎదుర్కోవడానికి చట్టాలు ఉన్నా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రానంతవరకు.. ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు. తాజాగా ఓ మహిళను వేధిస్తున్నాడని ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన ఘటన ఏపీ(AP Crime) లో చోటు చేసుకుంది.
మహిళలను వేధించినందుకే..
నెల్లూరు జిల్లా(Nellore District) లో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చంపడం కలకలం రేపింది. మూలపేటలోని అలంకార్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… మూలపేటకు చెందిన లైక్ అనే యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తల్వార్, గొడ్డళ్లు వంటి పదునైన ఆయుధాలతో వెంటాడి.. అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు లైక్ ఒక మహిళను వేధిస్తున్నాడని.. ఈ వేధింపుల కారణంగానే ఈ అఘాయిత్యం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
లైక్‌ను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా అతను పట్టించుకోలేదని.. దీంతో సహనం కోల్పోయిన నూరు.. మరికొందరు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నడిరోడ్డుపై నరికి చంపేంతగా తీవ్రత ఉన్న ఈ ఘటనతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందుతున్నారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరులో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





