ఆరుపులు విని నిద్రలో నుంచి లేచిన కూతుర్లు నిస్సి, ప్రైజ్‌లపై కూడా సురేష్ దాడికి పాల్పడ్డాడు. రాడ్డుతో తల్లి, పిల్లల తలలను పగలగొట్టాడు సురేష్. సామర్లకోటలోని సీతారామ కాలనీలో ఉన్న వారి నివాసంలో ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో గల సామర్లకోటలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హత్య చేయడంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో సంచలనం విషయాలు బయటకు వచ్చాయి. వివాహేతర సంబంధమే ముగ్గురి ప్రాణాలు తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి మాధురికి లారీ డ్రైవర్ సురేష్‌తో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం ఉంది. భర్తకు తెలియడంతో సురేష్‌ను దూరం పెట్టింది మాధురి. ఈ క్రమంలో వారం రోజులుగా మాధురి, సురేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త ధనుంజయ్ లేని సమయంలో ఇంట్లోకి వచ్చిన సురేష్ అర్ధరాత్రి మాధురిపై దాడి చేశాడు.
రాత్రి డ్యూటీకి వెళ్లిన తర్వాత
ఆరుపులు విని నిద్రలో నుంచి లేచిన కూతుర్లు నిస్సి, ప్రైజ్‌లపై కూడా సురేష్ దాడికి పాల్పడ్డాడు. రాడ్డుతో తల్లి, పిల్లల తలలను పగలగొట్టాడు సురేష్. సామర్లకోటలోని సీతారామ కాలనీలో ఉన్న వారి నివాసంలో ఈ ఘటన జరిగింది. మాధురి భర్త ధనుప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను రాత్రి డ్యూటీకి వెళ్లిన తర్వాత ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. మొదట పోలీసులు మాధురి భర్త ధనుప్రసాద్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అతని వాంగ్మూలంలో ఉన్న కొన్ని వైరుధ్యాలు ఈ అనుమానాలకు దారితీశాయి. అయితే, దర్యాప్తు తర్వాత ఈ హత్యలకు ప్రధాన కారకుడు సురేష్ అని పోలీసులు తేల్చారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సురేష్‌ను పాలకొల్లులో పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటనతో సామర్లకోట ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీలో మరో ఘోరం జరిగింది.అత్తవారి వేధింపులు భరించలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు గ్రామంలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి సచివాలయం ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి శ్రీ విద్య అనే అమ్మాయితో పెళ్లి కాగా ఆమె శ్రీ చైతన్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. వీరికి ఐదు నెలల కిందట వివాహం అయింది. శ్రీవిద్యకు పెళ్లి సమయంలో 10 లక్షల విలువ చేసే బంగారం, డబ్బు, రెండు అంతస్తుల ఇల్లు కట్నంగా ఇచ్చారు. అయితే కట్నం కింద తల్లిదండ్రులు ఇచ్చిన ఇంటిని అమ్మేయాలని శ్రీవిద్యపై ఆమె భర్త అరుణ్ ఒత్తిడి తీసుకొచ్చాడు. డైలీ ఫుల్ గా తాగి శ్రీ విద్యను హింసించేవాడు. ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా శ్రీ విద్యను వేధింపులకు గురిచేశారు. దీంతో భర్త అరుణ్ కుమార్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాగైనా అరుణ్ కుమార్‌ను శిక్షించాలని సూసైడ్ నోట్‌లో ఆమె రాసింది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్ కుమార్, తల్లి, తండ్రి పై వరకట్న కేసు నమోదు చేశారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!