SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో .. పురుగుల మందుతాగి మహిళా కానిస్టేబుల్‌ సూసైడ్!



రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో ఒక మహిళా కానిస్తేబుల్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గత ఐదేళ్లుగా మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


సాధారణంగా ప్రజలకు కష్టాలు వస్తే పోలీసుల దగ్గరకు వెళ్తారు.. కానీ ఆ పోలీసులకే కష్టం వస్తే వాళ్లు ఎవరకి చెప్పుకుంటూరు. కొందరు సమస్య తీవ్రతను బట్టి తెగించి పోరాడుతారు. ఉన్నాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ మరికొందరు ఆ సమస్యలను ఎదుర్కొలేకా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా రాచకొండ పీఎస్‌ పరిధిలోనూ ఇలాంటి ఘటనే వెళుగు చూసింది. ఒక మహిళా కానిస్టేబుల్‌ కుటుంబ కలహాలతో ఇంట్లో పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటననపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020 బ్యాచ్‌కు చెందిన (28) మనీషా గత ఐదేళ్లుగా మీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం నంది హీల్స్ లోని తన ఇంట్లో మనీషా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లో అపస్మార్క స్థితిలో పడిపోయి ఉన్న మనీషాను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే నాపంల్లిలోని కేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.

అయితే గత వారం రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మనీషా తాజాగా ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తన భర్త వేధింపుల కారణంగానే మనీషా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని కుటుంబసభ్యులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు


Also read

Related posts

Share this