మాయమాటలతో ట్రాప్ చేశాడు.. ప్రేమ పేరుతో వంచించాడు లోబరుచుకున్నాడు.. అంతటితో ఆగకుండా తమ వక్రబుద్ధిని బయటపెట్టాడు. చనువుగా ఉన్న ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బులిస్తే ఓకే లేకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని బెదిరించాడు.
స్నేహమన్నాడు.. నెమ్మదిగా దగ్గరయ్యాడు.. మాయమాటలతో ట్రాప్ చేశాడు.. ప్రేమ పేరుతో వంచించాడు లోబరుచుకున్నాడు.. అంతటితో ఆగకుండా తమ వక్రబుద్ధిని బయటపెట్టాడు. చనువుగా ఉన్న ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బులిస్తే ఓకే లేకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని బెదిరించాడు. కట్ చేస్తే.. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఆ నీచగాడి ఆట కట్టి కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు.. వివరాల్లోకి వెళితే.. విశాఖ గోపాలపట్నం ప్రాంతానికి చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది.. అయితే.. ఎలా పరిచయమయ్యాడో ఏమోగానీ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగంపేటకు చెందిన సరమండ శ్రీను అనే యువకుడు ఆమెతో కనెక్ట్ అయ్యాడు. స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానని చెప్పి సన్నిహితంగా మెలిగాడు.
వాడి మాటల్లో ఉన్న మర్మాన్ని గ్రహించలేక ఆమె నమ్మేసింది. ఇదే అదనంగా చేసుకొని ఆమెతో సన్నిహితంగా మెలిగాడు శ్రీను. సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. కట్ చేస్తే వన్ ఫైన్ డే.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్..! డబ్బులు ఇవ్వాలని ఆ యువతిని డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. భయంతో బాధితురాలు కొంత మొత్తం డబ్బు ఇచ్చింది. అయినా వాడి వేధింపులు ఆగలేదు. దీంతో ఇక ఏం చేయాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది ఆ యువతి.
వాడి వేధింపులు ఆగకపోవడంతో చివరకు ఇక చేసేది లేక గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు నిందితుడు శ్రీనును అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. అయితే.. నిందితుడుపై గతంలోనూ ఇదే తరహా కేసు నమోదైనట్లు పోలీసులకు చెబుతున్నారు. ఇటువంటి వారి పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025