కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. కోరికలు తీర్చాలంటూ ఆయన వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. కోరికలు తీర్చాలంటూ ఆయన వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భవిష్యత్ గురించి చెప్పాలంటూ ఆలయానికి క్యూ కడుతున్నారు. అయితే శనివారం మాత్రమే దేవుడుబాబు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే టోకెన్లు జారీ చేస్తున్నారు. స్త్రీ, పురుషులకు 108 చొప్పున టోకెన్లు జారీ చేస్తున్నారు. దేవుడు బాబుని శ్రీ వెంకటేశ్వర స్వామిగా భక్తులు భావిస్తుండటం విశేషం. శ్రీనివాసుడే ఆయన చేత భవిష్యత్ చెప్పిస్తున్నాడని నమ్ముతున్నారు. ఆలయం ముందు కోరికలు నెరవేరిన భక్తుల అన్నదానం కూడా చేస్తున్నారు.
50 ఏళ్ల నుంచి దేవుడుబాబా
ఈ గ్రామంలో చరిత్ర కలిగిన నారయణక్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలోనే 50 ఏళ్ల నుంచి దేవుడుబాబా అనే గురువు వెలిశాడు. అక్కడికి వచ్చిన భక్తుల భవిష్యత్తు గురించి చెబుతున్నారు. శనివారం రోజున కొన్ని నిమిషాల పాటే ఆయన భక్తులకు టైమ్ ఇస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలనుంచి దేవుడి బాబాను దర్శి్ంచుకునే అవకాశన్ని ఇస్తున్నారు. గర్భగుడిలో ఆయన ఓ మూలన కూర్చుని భక్తులకు భవిష్యత్తు గురించి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం రోజున మాత్రం భక్తులకు దర్శనం ఇచ్చే ఈ దేవుడుబాబు… ఎవరకి భవిష్యత్తు చెప్పరు. దేవుడు బాబు చెప్పిన భవిష్యత్తు చెప్పినట్లుగా జరుగుతుందని భక్తులు నమ్మి ఇక్కడికి వస్తున్నామని చెబుతున్నారు. ఎవరు వచ్చిన ఇక్కడ అన్నదానం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..