కుటుంబ కలహాలు సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. కొంతమంది భార్యలు భర్తల ఉసురుతీస్తుంటే, మరికొంతమంది భార్యలను హతమారుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారి తీసింది. మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
కుటుంబ కలహాలు సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. కొంతమంది భార్యలు భర్తల ఉసురుతీస్తుంటే, మరికొంతమంది భార్యలను హతమారుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారి తీసింది. భార్యభర్తల గొడవలో మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాల ప్రకారం గోపికుమార్ తన భార్యతో కలిసి అంబర్ పేటలో నివాసం ఉంటున్నాడు. అయితే గోపికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య అనుమానించడం మొదలుపెట్టింది. ఈ విషయంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.
కోపంలో వెళ్లిన భార్యను ఎలాగైన ఇంటికి తీసుకురావాలని భావించిన గోపికుమార్ మరునాడు హయత్‌నగర్‌లో ఉండే తన అత్తగారింటికి వెళ్లాడు.భార్య బతిమిలాడాడు. అయినా ఆమె తిరిగి రావడానికి ససేమిరా అంది. మరోవైపు అత్తింటివారు కూడా గోపితో గొడవపెట్టుకున్నారు. ఒకవైపు భార్య తిరిగి రావడానికి అంగీకరించకపోవడం, వారి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆవేదనతో అంబర్‌పేటలోని ఇంటికి చేరుకున్న గోపికుమార్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





