హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? దానికి తగిన చదువు, సర్టిఫికెట్లు లేవా? ఫికర్ మత్‌కరో భాయ్. B.Com, B.Tech..ఇలా ఏదైనా మనదగ్గర సరసమైన ధరలకు దొరకుతాయంటున్నారు కూకట్ పల్లిలోని KPHB ప్రాంతంలోని “శ్రీ వ్యాస కన్సల్టెన్సీ’ నిర్వహకులు.
కూకట్ పల్లిలోని KPHB ప్రాంతంలో శ్రీ వ్యాస కన్సల్టెన్సీ అనే పేరుతో కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న ఈ ముఠా నకిలీ B.Com, B.Tech సర్టిఫికెట్లు తయారు చేసి విద్యార్థులకు విక్రయిస్తూ మోసం చేస్తోంది. SOT శంషాబాద్ బృందం చేసిన దాడిలో ఇద్దరు ప్రధాన నిందితులు ఆకాసపు హరీష్, మావూరి మహేష్ లు పట్టుబడ్డారు. వీరి వెనుక విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి కీలక పాత్ర ఉందని తేలింది. అతను ముఠాకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా ఈ ముఠా ఇప్పటి వరకు సుమారు 46 మందికి నకిలీ సర్టిఫికెట్స్ విక్రయించినట్లు వెల్లడైంది. ఈ ముఠా తయారుచేసిన నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా 24 మంది అభ్యర్థులు విదేశాలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సర్టిఫికెట్స్ లేకుండానే వీరంతా వీసా పొంది విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్ల కోసం భారీగా డబ్బులు వసూలు చేసిన ముఠా, వారికి అవసరమైన సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలుస్తోంది.
అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ నిందితులను కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన ఎస్‌ఓటీ బృందం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా విదేశీ వీసాలు పొందిన వారిపై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ముఠాలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతోందని కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025