బాపట్ల జిల్లా సంతమాగులూరులో జరిగిన తండ్రీకొడుకుల హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ విభేదాలే తండ్రీకొడుకుల ప్రాణం తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఓ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
అది పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని శ్రీనిధి హోటల్.. ఉదయం 10గంటల సమయం.. వచ్చే పోయే వారితో హోటల్ కిటకిటలాడుతుంది. హోటల్లో టిఫిన్ చేసి కొంతమంది కిందకి దిగుతున్నారు. అదే సమయంలో హోటల్ ముందు బ్లాక్ కలర్ స్కార్పియో ఆగింది. హోటల్లో నుండి దిగిన వారితో కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఇద్దరిని బలవంతంగా స్పార్పియో ఎక్కించారు. కొద్దీ క్షణాల్లోనే అక్కడ నుండి స్పారియో రయ్ అంటూ దూసుకుపోయింది. అయితే వారితో పాటు వచ్చిన ఒక వ్యక్తి పెద్దగా కేకలు వేశాడు. మరో వ్యక్తి సాయంతో కొద్ది దూరం స్కార్పియోను ఫాల్ అయ్యారు. అయితే పట్టణం దాటిన తర్వాత ఆ కారు కనిపించకుండా పోయింది. కారును ఫాలో అయిన వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బెంగుళూరు నుండి వచ్చిన ఇద్దరిని కిడ్నాప్ చేశారని చెప్పాడు. పోలీసులు రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించే లోపే వారిద్దరిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సమాచారం వచ్చింది. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ప్లాట్స్‌లో మృతదేహాలను పడేసి వెళ్లి పోయినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు దర్యాప్తులో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సంతమాగులూరుకు చెందిన వీరాస్వామి రెడ్డి… బెంగుళూరు వెళ్లి సెటిల్ అయ్యాడు. వీరాస్వామి రెడ్డి అతని కొడుకు ప్రశాంత్ రెడ్డిలకు వారి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి మధ్య రియల్ ఎస్టేట్‌లో విబేధాలున్నాయి. ఈ క్రమంలోనే వీరాస్వామి రెడ్డి చెక్ బుక్ దొంగలించిన అనిల్ రెడ్డి చెక్ బౌన్స్ కేసులు పెట్టాడు. దీంతో వీరాస్వామి రెడ్డి అతని కొడుకుపై ఏపీలోని కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తండ్రి కొడుకులిద్దరూ వారి లాయర్‌తో కలిసి మొన్న సాయంత్రం నర్సరావుపేట వచ్చారు. బుధవారం కోర్టుకు వెళ్లేందుకు సిద్దమై పట్టణంలోని శ్రీనిధి హోటల్లో టిఫిన్ చేసేందుకు వచ్చారు. అదే సమయంలో అనిల్ రెడ్డి కొంతమందితో కలిసి అక్కడికి వచ్చాడు. టిఫిన్ చేసి బయటకు వచ్చిన వీరాస్వామిరెడ్డి అతని కొడుకుతో మాట్లాతున్న సమయంలోనే కారులో నుండి దిగిన దుండగులు లాయర్‌ను పక్కకు నెట్టి తండ్రికొడుకులిద్దరిని ఎత్తుకెళ్లారు.
అక్కడ నుండి కొంతదూరం తీసుకెళ్లి అత్యంత్య దారుణంగా హత్య చేసి సంతమాగులూరు ప్లాట్స్‌లో పడేసి వెళ్లిపోయారు. కిడ్నాప్ చేసి హత్యకు ఉపయోగించిన కారును చిలకలూరిపేట వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే రియల్ ఎస్టేట్‌లో వచ్చిన విబేధాల కారణంగానే తండ్రి కొడుకులను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరాస్వామి రెడ్డితో విబేధాలున్న అనిల్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. హత్యకు ఇంకా ఏమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!