SGSTV NEWS
CrimeTelangana

Love Couple Suicide : ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి…చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..


ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తున్న బండి హారిక (20), గాడిపల్లి శ్రీకాంత్ (24) లు ప్రేమించుకుంటున్నారు.

Love Couple Suicide : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.  ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తున్న బండి హారిక (20), గాడిపల్లి శ్రీకాంత్ (24) లు ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ డిగ్రీ పూర్తి చేసి ఆటో ట్రాలీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హారిక పదో తరగతి పూర్తయిన తర్వాత చదువు మానేసి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. ప్రేమ వ్యవహారం కుటుంబసభ్యులకు తెలియడంతోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో  హారిక ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

అయితే, వారి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హారిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న ఉరి వేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ కూడా పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు.ప్రేమించుకున్న యువతీ యువకులు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this