పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. భర్త డ్రైవర్.. ఈమే ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకుంటుంది.. ఇలా జీవితం సాఫీగా కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే వారి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు.. ఆమె కూడా.. భర్తను వదిలేసి ప్రియుడితోనే ఉందామనుకుంది.. భర్తను అడ్డు తొలగించుకుంటే.. తమకు ఇంకా ఎవరూ అడ్డు ఉండరని ప్లాన్ వేసింది..
పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. భర్త డ్రైవర్.. ఈమే ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకుంటుంది.. ఇలా జీవితం సాఫీగా కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే వారి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు.. ఆమె కూడా.. భర్తను వదిలేసి ప్రియుడితోనే ఉందామనుకుంది.. భర్తను అడ్డు తొలగించుకుంటే.. తమకు ఇంకా ఎవరూ అడ్డు ఉండరని ప్లాన్ వేసింది.. ఎలాగైనా అతన్ని భూమిపై లేకుండా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది.. గుట్టుచప్పుడు కాకుండా.. భర్త తినే సాంబారులో విషం కలిపి చంపేసింది.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు సాంబారులో విషం కలిపి హతమార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ (35) కు అమ్ముబీతో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది.. రసూల్, అమ్ముబీ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రసూల్ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. కొన్ని రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకొని, స్పృహ కోల్పోయాడు.. దీంతో కుటుంబీకులు హుటాహుటిన సేలంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతనికి చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన రక్త నమూనాలు పరీక్షించగా.. దానిలో పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో రసూల్ కుటుంబీకులు ఒక్కసారిగా షాకయ్యారు.. ఆయన భార్య అమ్మూబీపై అనుమానంతో ఆమెను అడిగారు.. ఆమె ఏవేవో పొంతన లేని విషయాలను చెప్పింది.. దీంతో ఆమె సెల్‌ఫోన్‌లోని వాట్సప్ చాటింగ్‌ను పరిశీలించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.
అమ్మూబీ స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో చాట్ చేసినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అందులో.. నువ్వు ఇచ్చిన విషాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపా.. దాన్ని నా భర్త తాగలేదు.. దీంతో ఆహారంలో కలిపా.. అంటూ అమ్ముబీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రసూల్ మృతి చెందడంతో.. కుటుంసభ్యులు అతని భార్య, ప్రియుడిపై ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అమ్ముబీ, లోకేశ్వరన్‌లను శనివారం అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
Also read
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి