SGSTV NEWS
CrimeTelangana

Adilabad: పగిలిన తలలు.. చిందిన రక్తం.. టైగర్ జోన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు!



కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో మళ్లీ పోడు రగడ భగ్గుమంది. ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవిశాఖపై పోడు రైతులు తిరగబడ్డారు. పోడు వ్యవసాయం చేస్తున్న భూముల్లో అటవిశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ముల్తానీ పోడు రైతులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో సుమారు 11 మంది గాయపడ్డారు.

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో మళ్లీ పోడు రగడ భగ్గుమంది. ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవిశాఖపై పోడు రైతులు తిరగబడ్డారు. పోడు వ్యవసాయం చేస్తున్న భూముల్లో అటవిశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ముల్తానీ పోడు రైతులు దాడులకు దిగారు. మా భూములను లాక్కొని మొక్కలు నాటుతామంటే ఊరుకునేది లేదంటూ ముల్తానీ పోడు రైతులు రాళ్లు, కర్రలతో అటవిశాఖ అదికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బంది పై సైతం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలవగా.. అటవిశాఖ, పోలీస్ శాఖకు చెందిన ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయాలపాలైన సిబ్బందిని ఇచ్చోడ, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు పెద్ద ఎత్తున భారీ బలగాలతో కేశవపట్నం చేరుకుంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం, సిరిచేల్మా అటవీ ప్రాంతంలో పోడు రగడ రెండు దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. తాజాగా ఈ నెల 5న సిరిచెల్మ, బాబ్జిపేట్ బీట్ పరిధిలోని 172, 174 కంపర్ట్మెంట్ లలోని పోడుభూములలో మొక్కలు నాటేందుకు వెళ్తున్న అటవీ అధికారులను కేశవపట్నం గ్రామస్థులు పోడు రైతులు చెల్కగుడ వద్ద అడ్డుకున్నారు. మూడు దశాబ్దాలుగా సాగు చేస్తున్న ఈ భూములు తామవేని కేశవపట్నం గ్రామాస్థులు పట్టుబట్టగా, అవి అటవీ భూములని ఎట్టి పరిస్థితుల్లోను మొక్కలు నాటి తీరుతామని అటవీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో రగడ రాజుకుంది. మధ్యాహ్నం వరకు ఇటు అధికారులు, అటు గ్రామస్థులు ఎవరు వెనక్కు తగ్గకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఉన్నతధికారులతో మాట్లాడి అటవీ అధికారులను వెనక్కి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

అయితే అటవీఅధికారులు వనమహోత్సవంలో భాగంగా ఈనెల 18 , 19 న మరొసారి మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. ఈ సారి కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని కేశవపట్నం పంచాయితీ బాబ్జిపేట బీట్ 71, 72 కంఫార్ట్మెంట్ లోని 60 ఎకరాల అటవి భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. దీంతో ఎదురు తిరిగిన పోడు రైతులు పోడు భూములను కాపాడుకునేందుకు రాళ్లు , కర్రలతో అటవిశాఖ, పోలీసు శాఖ సిబ్బంది పై దాడికి యత్నించారు. ఈ దాడిలో 11 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీస్ సిబ్బంది తలలు పగిలాయి. అటవిశాఖ , పోలీస్ శాఖ వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడితో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన అటవిశాఖ సిబ్బంది పోలీసుల రక్షణ వలయంలో ఇచ్చోడ చేరుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు శాఖ ఆందోళనకారులను గుర్తించేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సమక్షంలో ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. రాళ్ల దాడితో కేశవపట్నం నివురుగప్పిన నిప్పులా మారింది.

Also read

Related posts

Share this