మహబూబాబాద్‌లోని ఓ మొబైల్ షాప్ ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. నల్ల అన్నం, కోడిగుడ్లు, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో కూడిన పూజా సామగ్రిని తీసుకొచ్చి అక్కడ పడేశారు. సీసీ కెమెరాలో ఓ అనుమానిత మహిళ దృశ్యాలు రికార్డ్ అయినట్లు స్థానికులు తెలిపారు.
మహబూబాబాద్ పట్టణంలో ఓ ప్రముఖ మొబైల్ షాప్ ముందు క్షుద్రపూజల కలకలం రేగింది. నిత్యం కస్టమర్లతో కళకళలాడుతున్న ఆ షాప్ ఎదుట సోమవారం ఉదయం కనిపించిన కొవ్వొత్తులు, నల్ల అన్నం, కోడిగుడ్లు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు స్థానికులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేశాయి.
షాప్ యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు ఓ గుర్తు తెలియని మహిళ పూజా సామగ్రిని అక్కడ ఉంచి వెళ్లిన దృశ్యాలను గుర్తించారు. మహిళ రాత్రి పదకుండున్నర సమయానికి అక్కడికి చేరుకుని.. ఆ పదార్థాలు చల్లి, కొద్దిసేపు నిలబడిన తరువాత వెళ్లినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. ఈ షాప్ రోజూ కస్టమర్లతో రద్దీగా ఉంటోంది. వ్యాపారం బాగా నడుస్తుండటంతో ఓర్వలేని వ్యతిరేకులు క్షుద్రపూజలకు పాల్పడారా? లేక ఇంకా వేరే కోణాలు ఉన్నాయా అనే అంశపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను విశ్లేషిస్తున్నారు. మహిళ ఎక్కడినుంచి వచ్చిందో, ఎటు వెళ్లిందో గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





