SGSTV NEWS
Andhra PradeshCrime

TTD: నలుగురు టీటీడీ ఉద్యోగులపై సస్సెన్షన్ వేటు.. కారణం ఇదే!



తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను టీటీడీ బోర్డు సస్పెండ్‌ చేసింది. వీరు టీటీడీ నిబంధనలకు విరుద్దంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్థారణ కావడంతో పాటు, హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని వీరిపై టీటీడీ చర్యలు తీసుకుంది.


తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను టీటీడీ బోర్డు సస్పెండ్‌కు చేసింది. వీరు టీటీడీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కారవడంతో టీటీడీ చర్యలు తీసుకుంది. టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.ఎలిజర్‌, బర్డ్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తున్న ఎస్‌.రోసి, గ్రేడ్‌ -1 ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి.అసుంతలను టీటీడీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు, వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగిందిని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.


సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీలో ఉద్యోగులుగా పనిచేస్తూ టీడీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోగా.. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించి..నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ.. నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేసినట్టు టీటీడీ పేర్కొంది.

అయితే ఇలాంటి ఆరోపణలతో ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబు సస్పెండ్ అయ్యారు. టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేస్తున్న రాజశేఖర్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రతి ఆదివారం చర్చ్‌లో ప్రార్థనకు వెళ్తున్నటు వచ్చిన ఫిర్యాదులు రుజువు కావడంతో టీటీడీ అతని చర్యలు తీసుకుంది.

Also read

Related posts

Share this