SGSTV NEWS
Andhra PradeshCrime

Illicit Relationship: అక్రమ సంబంధం పెట్టుకుందని.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!


చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ  (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు. తల్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని పిడిగుద్దులతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేశాడు.


AP Crime:  చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ  (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు.  చిత్తూరు జిల్లా, రొంపిచర్ల మండలం, మోటమల్లెల పంచాయతీ,నగరి గ్రామానికి చెందిన శారదకు తిరుపతి జిల్లా,చిన్నగొట్టిగల్లు మండలం, కోటబైలు పంచాయతీ,నల్లఓబులవారిపల్లి గ్రామానికి చెందిన సురేష్ తో వివాహమైంది. కాగా భర్త సురేష్‌ గత కొంతకాలంగా కువైట్‌లో పనిచేస్తున్నాడు.


శారధ తన ఇద్దరు కుమారులతో కలిసి గొల్లవానికుంటలో నివాసం ఉంటుంది. కాగా శారధ  రేణిగుంట రోడ్డులోని మారుతీ షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తోంది. రోజు విధులకు వెళ్లి వస్తోంది.ఈ క్రమంలోనే తల్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన కొడుకు శారధపై  పిడిగుద్దులతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేశాడు. బంధువులు ఫిర్యాదు చేయడంతో  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామనిఅలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు.

Also read

Related posts