ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. దీంతో అటువైపుగా వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి ఆమెను తన కారులో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఒక కారు మహిళా టీచర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే అటువైపుగా వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి ఆమెను తన కారులో హాస్పిటల్‌కు తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే
కర్నూలు జిల్లాకు చెందిన కె. పద్మావతి (42) గణిత మహిళా టీచర్‌గా గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యా పరిశోధనా మండలిలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె తన ఇంటికి వెళ్లేందుకు మరో మహిళతో కలిసి ఆత్మకూరులోని నేషనల్ హైవేపై రోడ్డు దాటింది. అదే సమయంలో విజయవాడ మార్గం నుంచి గుంటూరు వెళ్తున్న ఒక కారు అతి వేగంతో ఆ మహిళా టీచర్‌ను ఢీకొట్టింది
దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆమెను తన కారులో మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే టీచర్ పద్మావతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన నిందితులు కొద్ది దూరంలో కారును ఆపి అక్కడ నుంచి పరారైనట్లు సమాచారం.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025
Tirumala: గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది.. టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న రమణదీక్షితులు