SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: నెల్లూరు జిల్లాలో మరో భర్త హత్య..ప్రియుడితో కలిసి గొంతుకు వైరు బిగించి….


ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న భార్యల కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట భర్తలు హత్యకు గురవుతున్నారు. తాజాగా  నెల్లూరు జిల్లా రాపూరు లో  ప్రియుడు తో కలిసి భర్తను అతి దారుణం గా హత్య చేసింది భార్య.

AP Crime: ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న భార్యల కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట భర్తలు హత్యకు గురవుతున్నారు. తాజాగా  నెల్లూరు జిల్లా రాపూరు లో  ప్రియుడు తో కలిసి భర్తను అతి దారుణం గా హత్య చేసింది భార్య. రాపూరు దళితవాడకు చెందిన శీనయ్య కు రెండేళ్ళ  క్రితం రాపూరు సమీపంలోని పంగళి గ్రామానికి చెందిన దనమ్మ తో వివాహం జరిగింది. అయితే దనమ్మ పెళ్లికి ముందు అదే గ్రామానికి చెందిన యువకున్ని ప్రేమించింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

శీనయ్యతో పెళ్లి అయిన తర్వాత కూడా దనమ్మ ఆ యువకుడితో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అయితే ఇటీవల ఈ విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విషయాన్ని తన ప్రియుడికి చెప్పడంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న శీనయ్యను అడ్డు తొలగించుకోవాలని భావించారు. దీంతో రాత్రి శీనయ్య గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రియుడితో కలిసి గొంతుకు వైరు బిగించి హత్య చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, దనమ్మను శీనయ్య బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

Also read

Related posts

Share this