విజయవాడ గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులను రౌడీ షీటర్ కిషోర్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు
విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులు ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరి దగ్గరికి రౌడీ షీటర్ కిషోర్ వెళ్లి వాగ్వాదానికి దిగాడు. గొడవ తీవ్రంగా ముదరడంతో కత్తితో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఇద్దరు యువకుల మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ కిషోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే హత్యకు గురైన వారిలో ఒకరు విజయనగరానికి చెందిన వారు కాగా, మరొకరు విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Also read
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?





