SGSTV NEWS
Astro Tips

Money Astrology: రాహువుకు ఇష్టమైన రాశులివే.. ఇక వారికి డబ్బే డబ్బు!

 

Rahu Impact: రాహువు ధనయోగం, విదేశీ సంబంధాలకు కారకుడు. వృషభం, మిథునం సహా కొన్ని రాశుల వారికి రాహువు అనుకూలంగా ఉండటం వల్ల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి, ఆకస్మిక ధనలాభం, విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. కొన్ని రాశులకు ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది.

వక్ర గ్రహమైన రాహువు విదేశాలకు, ధన వ్యామోహానికి, అక్రమ సంపాదనకు కారకుడు. ఈ గ్రహం అనుకూలంగా ఉన్న పక్షంలో ఐశ్వర్యవంతులవుతారు. తనకు అవకాశం లభించినప్పుడు రాహువు తప్పకుండా ఆదాయాన్నిచ్చి ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. లేదా తనకు ఇష్టమైన, అనుకూలమైన రాశులవారికి వీలైనంతగా ధన యోగాలు పట్టిస్తాడు. ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువు ఈ నెల 15 నుంచి సుమారు రెండున్నర నెలల పాటు వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు ధన యోగాలను కలిగించే అవకాశం ఉంది. రాహువు కుంభ రాశిలో 2026 డిసెంబర్ వరకు సంచారం చేస్తాడు.


వృషభం: ఈ రాశికి రాహువు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల పూర్తి శుభుడుగా మారి ధన యోగాలు, రాజయోగాలు కలిగిస్తాడు. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు మంచివి.

మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రాహువు ప్రవేశం వల్ల విదేశీ సంబంధమైన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు అనుకూలిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా అభివృద్ధి బాట పడతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

కన్య: ఈ రాశివారికి షష్ట స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు, అదనపు రాబడి బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి అయిదవ స్థానంలో రాహువు సంచారం వల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆస్తి సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు కొన డం జరుగుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొన్ని ముఖ్యమైన కష్టనష్టాల నుంచి బయటపడతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది.

కుంభం: ఈ రాశిలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు కలుగుతాయి. కుంభ రాశిలో రాహు గ్రహానికి దాదాపు ఉచ్ఛస్థితి కలుగుతుంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు, అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.

Also read

Related posts

Share this