ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ పేరు మార్చుకొని డజన్ల కొద్దీ అమ్మాయిలను మోసం చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ పేరు మార్చుకొని డజన్ల కొద్దీ అమ్మాయిలను మోసం చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. యువకుడిని నవేద్ అలియాస్ ఖాసిం పఠాన్‌గా గుర్తించారు. సోషల్ మీడియాలో తన పేరు శివ వర్మగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. నుదిటిపై తిలకం పెట్టుకుని, చేతికి కలావ కట్టుకుని హిందువుగా చెప్పుకునేవాడు. ఖాసిం డజనుకు పైగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకున్నాడని పోలీసులు తెలిపారు.
దాదాపు 2 డజన్ల మంది హిందూ యువతుల అశ్లీల చిత్రాలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. వారిలో చాలామందిని ఇస్లాం మతంలోకి మారమని అతను బలవంతం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఒక బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ప్రస్తుతం మిగిలిన అమ్మాయిల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. నిందితుడు నవేద్ అలియాస్ ఖాసిం పఠాన్ని అత్యాచారం, మోసం, బలవంతపు మతమార్పిడి వంటి సెక్షన్ల కింద అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




