SGSTV NEWS
Andhra PradeshCrime

Arunachalam: అరుణాచలంలో దారుణం.. గిరిప్రదక్షిణలో తెలుగు భక్తుడిపై కత్తితో దాడి చేసి..



అరుణాచలంలో తెలుగు భక్తుడిపై దాడి కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు విద్యాసాగర్ అనే భక్తుడిని ఢీకొట్టారు. ఈ క్రమంలో పెద్ద గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయన యువకులు తెలుగు భక్తుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన భక్తుల్లో భయాందోళన రేపింది.


అరుణాచలం.. గత కొంత కాలంగా తెలుగు భక్తులు ఎక్కువగా వెళ్తున్న ఆలయం. పౌర్ణమి వచ్చిందంటే చాలు ఈ ఆలయానికి జనాలు పోటెత్తుతారు. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి తమ ముక్కులు చెల్లించుకుంటారు. తమిళనాడులోని తిరువణ్ణామలై పట్టణంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నికి ప్రతీక. అయితే అరుణాచలం వెళ్లిన ఓ తెలుగు భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. శివయ్య దర్శనం కోసం వెళ్తే తమ బిడ్డ ప్రాణమే పోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన భక్తుల్లో భయాందోళన రేపగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ అరుణాచలం వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. అయితే బైక్ ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి విద్యాసాగర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అతడు కిందపడిపోగా స్వల్పగాయాలయ్యాయి. ఈ క్రమంలో బైక్ పై ఉన్న వ్యక్తులతో వాగ్వాదానికి దిగాడు.  కోపంతో ఊగిపోయిన బైక్‌పై ఉన్న వ్యక్తులు తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలవ్వగా.. తోటి భక్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్, తమిళరసన్ అనే యువకులను అరెస్ట్ చేశారు. శివయ్య దర్శనం కోసం వెళ్తే తమ బిడ్డ ప్రాణమే పోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు

Also read

Related posts

Share this