SGSTV NEWS
CrimeTelangana

బడా వ్యాపారులే టార్గెట్‌.. ఫేక్ పోలీసుల చేతివాటం.. భారీగా నగలు, నగదు వాహనాలతో..



బాధితుల ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో ఐదుగురి పై రెండు కేసులు నమోదు కాగా నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు వోట్కూరి నరేష్ పరారిలో ఉన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎవరైనా పోలీసుల పేరిట బెదిరింపులకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, డబ్బులు పంపి మోసపోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.

నేను ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి ని మాట్లాడుతున్నాను.. మీరు గతంలో దొంగ బంగారం కొన్న వివరాలు మా దగ్గర ఉన్నాయి.. మీపై కేసు నమోదు కావద్దంటే అడిగినంత ఫోన్ పే లేదా, గూగుల్ పే చేయండి ” అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారులను బెదిరిస్తూ.. 18 లక్షల రూపాయల వరకు వసూలుకు పాల్పడిన ముఠాను చాక చక్యంగా పట్టుకున్నారు జిల్లా పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు… జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లాకు చెందిన షేక్ ఇర్ఫాన్(24), చింతలచెరువు ప్రశాంత్ (24),బదనాపురి అజయ్ (29),బొప్పం సుధాకర్ (28) అను వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి దొంగ బంగారం పేరిట జ్వెలరి షాపుల యజమానులకు ఇచ్చోడ ఎస్సై పేరిట ఫోన్ లు చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూండగా, అనుమానం వచ్చిన ఇద్దరు వ్యాపారులు నిర్ధారణ చేసుకునేందుకు ఇచ్చోడ ఎస్సై అధికారిక ఫోన్ నంబర్ తెలుసుకుని, ఫోన్ చేయడంతో ఈ విషయం జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో ఐదుగురి పై రెండు కేసులు నమోదు కాగా నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు వోట్కూరి నరేష్ పరారిలో ఉన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎవరైనా పోలీసుల పేరిట బెదిరింపులకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, డబ్బులు పంపి మోసపోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 215/2025, సెక్షన్ 318(4), 308(2), 317 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2025 జూన్ 27న ఇచ్చోడ ఎస్‌ఐ వి. పురుషోత్తం కు కొండొజు నరసింహచారి (రంగారెడ్డి నివాసి) అనే వ్యక్తి ఫోన్ చేసి, తన సోదరుడు చేపురి సతీష్ కుమార్‌కు 6301395160 నంబర్ నుండి కాల్ వచ్చిందని, అవతలి వ్యక్తి తాను ఇచ్చోడ పీఎస్‌ ఎస్‌ఐ నర్సిరెడ్డిని అని పరిచయం చేసుకుని, నాలుగు ఏళ్ల క్రితం 11 గ్రాముల దొంగ బంగారం కొన్నారని, కేసు కాకుండా ఉండాలంటే ఫోన్‌పే/గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని చెప్పారని ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చి, ఎస్‌ఐ ఇచ్చోడ గారి అధికారిక నంబర్‌కు ఫోన్ చేయగా, అది నకిలీ పోలీసు అని తెలిసింది. వెంటనే ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 208/2025, సెక్షన్ 308(2) BNS కింద కేసు నమోదు చేశారు.


దర్యాప్తు కొనసాగుతుండగా, 2025 జూలై 4న రుద్రంగి కిరణ్ కుమార్ (హైదరాబాద్ నివాసి) అనే వ్యక్తి ఇచ్చోడ ఎస్‌ఐకి ఫోన్ చేసి, బాధితునికి 9866193420 నంబర్ నుండి కాల్ చేసి ఎస్‌ఐ నర్సిరెడ్డి, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నానని బుకాయించి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి డబ్బులు పంపమని కోరగా, గూగుల్ పే ద్వారా రూ.150 పంపినట్లు తెలిపారు. తర్వాత అనుమానం వచ్చి ఎస్‌ఐ ఇచ్చోడ కు తెలియజేయగా, అది కూడా నకిలీ పోలీసు అని తెలిసింది. రెండవ కేసు వెంటనే ఇచోడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 215/2025, సెక్షన్ 318(4), 308(2), 317 BNS కింద కేసు నమోదు చేశారు.

నిందితుల విచారణలో షేక్ ఇర్ఫాన్ తన నేరాన్ని అంగీకరించాడు. తాను జల్సాలకు అలవాటు పడి గత కొన్ని ఏళ్లుగా గూగుల్ ద్వారా నగల షాపుల వివరాలు తెలుసుకుని వారికి కాల్ చేసి, తాను ఎస్‌ఐని అని, రెండు సంవత్సరాల క్రితం ఒక జంట వద్ద నుండి 11 గ్రాముల దొంగ బంగారం కొన్నారని, మీపై కేసు నమోదు అవుతుందని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడినని తెలిపాడు. ఈ నేరంపై గతంలో 2023లో నల్గొండ-II టౌన్‌లో క్రైమ్ నంబర్ 123/2023, సెక్షన్ 419, 384 ఐపీసీ కింద, 2025లో హుజూర్‌నగర్ పీఎస్‌లో క్రైమ్ నంబర్ 50/2025, సెక్షన్ 318(4), 308(2) BNS కింద కేసులు నమోదైనట్లు వెల్లడించాడు.

మార్చిలో జైలు నుండి విడుదలయ్యాక తిరిగి జల్సాలకు అలవాటు పడి, గత మూడు నెలల్లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నాడని తెలిపాడు. ఈ డబ్బులతో ఒక బెలానో వాహనం, కొనుగోలు చేసిన బుల్లెట్ మోటార్ సైకిల్ (నం. TS11EU2405), బజాజ్ మాక్సిమా ఆటోరిక్షా, 1.36 గ్రాముల బంగారం, 14 తులాల వెండి కాలిపట్టీలను తన భార్యకు ఇచ్చినట్లు తెలపగా, అదేవిధంగా మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక బెలానో కారు, ఒక బుల్లెట్ బైక్, ఆటో, బంగారం, వెండి స్వాధీనం చేసులున్నబి.. నిందితులు నల్గొండ జిల్లా కు చెందిన వారిగా తెలిపారు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్

Also read

Related posts

Share this