ఫుల్లుగా పీకలదాక తాగాడు.. చికెన్ పకోడి కోసం వెళ్లాడు.. ఈ క్రమంలో యజమాని చికెన్ పకోడి లేదంటూ అతనికి చెప్పాడు.. కానీ.. అతను మాత్రం వినిపించుకోలేదు.. చికెన్ పకోడి కావాలంటూ యజమానితో గొడవకు దిగాడు.. చూస్తుండగానే.. చికెన్ పకోడి వివాదం.. పెద్దదిగా మారింది.. చికెన్ పకోడి లేదంటావా అంటూ.. హోటల్ యజమానిని దారుణంగా చంపాడు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జిల్లాలో చోటుచేసుకుంది.. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికెన్ పకోడీ లేదన్నాడని.. హోటల్ యజమానిని పీకకోసి చంపేశాడు.
వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు.. ఆ తర్వాత మద్యం మత్తులో సమీపంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళ్లి.. చికెన్ పకోడీ కావాలంటూ అడిగాడు.. అయితే షాపు యజమాని శంకర్.. చికెన్ పకోడి లేదని మిన్నారావుకి చెప్పాడు. అయితే.. అలా కాదు.. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ చికెన్ పకోడీ ఇవ్వాల్సిందే అంటూ శంకర్ ను పట్టుబట్టాడు.
శంకర్ లేదని చెప్పినా.. వినకుండా మిన్నారావు.. షాపు తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్‌పై దాడి చేయబోయాడు.. ఇక్కడ వారి మధ్య వాదన పెరిగి.. కొట్టుకునే వరకు వెళ్లింది.. అప్పటికే మద్యం తాగి మత్తులో ఉన్న మిన్నారావు.. పక్కనే ఉన్న సుత్తిని తీసి శంకర్ తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత.. పక్కనే ఉన్న కత్తిని తీసి పీక కోశాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుకు అవతల వైపు ఉన్న కాలువలో పడేసి.. అక్కడి నుంచి వెళ్లాడు..
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025