SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్‌లో ఘోరం..భార్యను వివస్త్రను చేసి, హత్యచేసిన భర్త


తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లోని బోరబండలో ఆమానవీయ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో భార్యను వివస్త్ర చేయడంతో పాటు గుండు చేయించి మరి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. బోరబండలోని సాయిబాబానగర్‌లో భార్యను భర్త నర్సింహులు దారుణంగా హత్య చేశాడు.


TG Crime : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లోని బోరబండలో ఆమానవీయ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో భార్యను వివస్త్ర చేయడంతో పాటు గుండు చేయించి మరి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. బోరబండలోని సాయిబాబానగర్‌లో భార్యను భర్త నర్సింహులు దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో ఉన్న నర్సింహులు తన భార్య సోనితో గొడవపడ్డాడు. అనంతరం గుండు గీసి, వివస్త్రను చేసి చంపేశాడు. మద్యం మత్తులో రెచ్చిపోయిన నర్సింహులు సోనికి మద్యం తాగిస్తూ అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేశాడు.. అనంతరం ఆమె దుస్తులను తీసివేసి వాటిని తగలబెట్టాడు. వివస్త్రగా ఉన్న సమయంలోనే ఆమెను కిరాతకంగా చంపివేశాడు.

ఆరేళ్ల క్రితం సోనికి, నర్సింహులుకు పెళ్లి కాగా నర్సింహులు మద్యానికి బానిసై ఎక్కడ పనిచేయడం లేదని తెలుస్తోంది. కాగా నర్సింహులు ఈ మధ్యనే ఓ ఆలయంలో చోరీకి పాల్పడినట్లు తెలిసింది. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో సోని నర్సింహులుకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న నర్సింహులు ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా బోరబండలో ఉంటున్న న‌ర్సింహులు స్థానికంగా చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఆయ‌న దొంగ‌త‌నం కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చిన‌ట్టు తేలింది. మొత్తం అత‌నిపై ప‌ద‌హారు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా సోని హత్యతో స్థానికంగా కలకలం రేగింది.

Also read

Related posts

Share this