కుక్కట్‌పల్లిలో రౌడీ షీటర్‌గా పేరున్న సయ్యద్ షాహిద్‌ను అతని స్నేహితులు సాజిద్, సమీర్ ఖాన్, మున్నా అనే ముగ్గురు హత్య చేశారు. షాహిద్ స్థానంలో తాము పెత్తనం చేయాలనే ఉద్దేశంతో ఈ హత్య జరిగింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తమ ప్రాంతంలో రౌడీ షీటర్‌గా పెత్తనం చెలాయిస్తున్న రౌడీని హతమార్చి ఆ స్థానాన్ని తాము సొంతం చేసుకోవాలని ముగ్గురు కలిసి హత్యకు పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసిన కూకట్‌పల్లి పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ వివరాలు వెల్లడించారు. బోరబండలో పేరు మోసిన రౌడీ షీటర్ కొడుకు సయ్యద్ షాహిద్ (26) సైతం ఆ ప్రాంతంలో తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ రౌడీ షీటర్‌గా కొనసాగుతున్నాడు. షాహిద్ ను అడ్డు తొలగించి ఆ స్థానంలో తాము నిలవాలని అతని స్నేహితులు ఎండి సాజిద్ (24), ఎండి సమీర్ ఖాన్ (25), వై.హనాక్ (25) అలియాస్ మున్నా లు పన్నాగం పన్నారు.
పథకం ప్రకారం గత నెల 29వ తేదీన పవన్ అనే స్నేహితుడి జన్మదిన వేడుకలకు కూకట్‌పల్లి ప్రకాష్ నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో హాజరైన షాహిద్, సాజిద్, మున్నాలు మద్యం సేవించాక.. మత్తులోకి వెళ్లిన షాహిద్ పై సాజిద్, మున్నాలు ముందుగా బీర్ బాటిల్ తో మెడ పై పొడిచి, తరువాత బండ తలతో బాది హత్య చేశారు. ఆ తర్వాత సంఘటన స్థలం నుండి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండుకి తరలించినట్లు డీసీపీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు
Also read
- వధూవరుల చేతిలో కొబ్బరిబోండమే ఎందుకు ఉంచుతారు.. దీని వెనక ఇంత స్టోరీనా?
- Adhi Yoga: ఈ రాశుల వారికి త్వరలో అధికారం, ఆదాయం! ఇందులో మీ రాశి ఉందా?
- రేపే గురుపౌర్ణమి.. ఈ 5 ప్రదేశాల్లో ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..
- Guru Purnima 2025: గురువారం గురు పౌర్ణమి.. ఈ రాశులపై బృహస్పతి ఆశీస్సులు.. చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
- నేటి జాతకములు..10 జూలై, 2025