మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆసక్తికర ఘటన జరిగింది. మూడు రోజుల నవజాత శిశువును ఓ జంట రోడ్డు పక్కన ఓ ప్లాస్టిక్ బుట్టలో వదిలేసి వెళ్లారు. ‘మా ఆర్థిక పరిస్థితి బాలేక ఇలా చేయాల్సి వచ్చిందని.. క్షమించండి’ అంటూ ఓ నోట్‌ను కూడా రాశారు
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆసక్తికర ఘటన జరిగింది. మూడు రోజుల నవజాత శిశువును ఓ జంట రోడ్డు పక్కన ఓ ప్లాస్టిక్ బుట్టలో వదిలేసి వెళ్లారు. ‘మా ఆర్థిక పరిస్థితి బాలేక ఇలా చేయాల్సి వచ్చిందని.. క్షమించండి’ అంటూ ఓ నోట్‌ను కూడా రాశారు. ఆ చిన్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పన్వేల్ ప్రాంతంలోని టక్కా కాలనీలో రోడ్డు పక్కన ఈ ఘటన జరిగింది.
” మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అందుకే ఈ ఆడబిడ్డను తాము పెంచలేము. మాకు వేరే మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చింది. క్షమించండి అంటూ” లేఖలో రాశారు. అయితే బుట్టలో నవజాత శిశువును చూసి అక్కడి స్థానికులు షాకైపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆడపిల్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత చిన్నారిని పిల్లల డాక్టర్‌కు చూపించారు. ఆ శిశువు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలా రోడ్డు పక్కన శిశువును బుట్టలో వదిలేసిన తల్లిదండ్రుల కోసం గాలిస్తు్న్నామని తెలిపారు. ఇదిలాఉండగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఆడపిల్ల పుడితే వాళ్లని పెంచే ఆర్థిక స్తోమత లేదనే కారణంతో చెత్త కుండి, ఇతర చోట్ల తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!