జూన్ 15 ఆదివారం రాత్రి శీతల్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సోనిపట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపారు. స్థానిక సివిల్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం పంపారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
హర్యానాలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మోడల్ శీతల్ అలియాస్ సిమ్మీ చౌదరి శవమై కనిపించింది. హర్యానాలోని సోనిపట్‌లోని ఖార్ఖోడా ప్రాంతంలో శీతల్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. దుండగులు శీతల్‌ని గొంతు కోసి చంపారు. ఖండా గ్రామానికి సమీపంలోని ఓ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె చేతులు, ఛాతీపై ఉన్న పచ్చబొట్లు ఆధారంగా ఆమెను పోలీసులు గుర్తించారు. శీతల్ హర్యాన్వి మ్యూజిక్ వీడియోలలో పనిచేసేది. ఆమె తన సోదరి నేహాతో కలిసి ఖలీలా మజ్రాలో నివసిస్తోంది.
ఈ క్రమంలోనే జూన్ 14న మ్యూజిక్ వీడియో షూట్ కోసం అహర్ గ్రామానికి వెళ్లింది. ఇంటికి తిరిగి రాలేదని శీతల్ సోదరి నేహా గతంలో పానిపట్‌లోని మట్లౌడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూన్ 15 ఆదివారం రాత్రి శీతల్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సోనిపట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపారు. స్థానిక సివిల్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం పంపారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
అయితే, జూన్ 14న షూటింగ్ కోసం ఇంటి నుండి వెళ్లిన శీతల్‌ను అక్కడ ఆమె ప్రియుడు కలిసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడే తమ కుమార్తెపై దాడి చేశాడని ఆరోపించారు. శీతల్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు
Also read
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో
- విదేశీ అమ్మయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు