వరంగల్‌లో జరిగిన ఓ వృద్ధురాలి మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. కొడుకే సవతితల్లిని హత్య చేసినట్లుగా గుర్తించారు.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు నిందితుడని అరెస్టు చేసిన రిమాండ్‌కు పంపారు. ఈ హత్య హనుమకొండ శివారులోని పెగడపల్లి గ్రామంలో జరిగింది.. రెండు రోజుల క్రితం సరోజన అనే మహిళ పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడిచేసి అతికిరాతంగా నరికిచంపారు. వృద్ధురాలిని ఎవరు చంపి ఉంటారో విచారణ చేపట్టిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.. చివరకు కొడుకే ఆస్తికోసం పథకం ప్రకారం సవతి తల్లిని హత్య చేశాడని గుర్తించారు.. నిందితుడు జైపాల్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఆస్తి కోసం సవతితల్లి పట్ల కొడుకు ప్రవర్తించిన తీరే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.. నిందితుడు జైపాల్ రెడ్డి తల్లి వనమ్మ అతని చిన్నతనంలోనే చనిపోయింది.. ఆ తర్వాత తండ్రి శ్రీనివాసరెడ్డి సరోజన అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. మొదటిభార్య కొడుకు జైపాల్ రెడ్డి పట్ల పట్టింపు లేకపోవడంతో ఈ కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి.
తండ్రి శ్రీనివాస్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తిలో మూడున్నర ఎకరాలు తన ఇద్దరు బిడ్డల పేరిట రాసి ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన కొంతభాగం భూమి కనీసం తనకు కౌలు చేసుకోవడానికి కూడా సవతి తల్లి అంగీకరించకపోవడంతో కక్షపెంచుకున్న జైపాల్ రెడ్డి సవతితల్లిని పక్కా ప్లాన్ ప్రకారం గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
హత్య అనంతరం పరారీలో ఉన్న జైపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టుచేసి మీడియా ముందు హాజరుపరిచారు. సవతితల్లి తనను పట్టించుకోకపోవడం, ఆస్తి మొత్తం తన బిడ్డలకే రాసి ఇవ్వడం వల్లనే జైపాల్ రెడ్డి హత్యకు పాల్పడినట్లుగా హనుమకొండ ఏసీపీ నరసింహరావు ప్రకటించారు.. నిందితుడు ఉపయోగించిన గొడ్డలి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





