సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఓ మహిళ ఉదయం రెండో బిడ్డకు జన్మనివ్వగా అదే రోజు సాయంత్రం ఆమె మొదటి బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన ప్రసాద్, అంజలి దంపతులు రెండో బిడ్డ పుట్టగా అదే రోజు సాయంత్రం వారి 8 ఏళ్ల కుమారుడు దిలీప్ చెరువులో మునిగి చనిపోయాడు. దీంతో ఓ బిడ్డకు నమ్మనిచ్చామని కాస్త సంతోషం కూడా ఆ తల్లిదండ్రుల దక్కకుండా పోయింది.
ప్రసాద్, అంజలి దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వగా అదే రోజు సాయంత్రం వారి మొదటి బిడ్డ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన ప్రసాద్, అంజలి దంపతులకు 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ప్రసాద్, అంజలి దంపతుల 8 ఏళ్ల కుమారుడు దిలీప్ ఉన్నారు. అయితే ప్రసాద్ భార్య ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పండంటి బిడ్డను జన్మనిచ్చామనే ఆనందం ఆ దంపతులలో ఎక్కువ సేపు నిలువ లేక పోయింది. ఆ రోజు సాయంత్రంలోపే ఆ దంపతులు సంతోషం ఆవిరైపోయింది.
ప్రసాద్, అంజలి దంపతుల మొదటి కుమారుడైన దిలీప్ అదే రోజు సాయంత్రం చెరువులో పడి మరణించడం ఆ కుటుంబంతో తీవ్ర విషాదాన్ని నింపింది. అమ్మమ్మ బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా.. ఆమె వెనకే వెళ్లిన దిలీప్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఉదయం రెండో బిడ్డకు జన్మనిచ్చి.. సాయంత్రానికి మొదటి బిడ్డ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ వైపు బిడ్డ పుట్టాడన్న సంతోషం.. మరోవైపు ఇంకో బిడ్డ మరణించాడు అన్న విషాదంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు వినిపిస్తున్నారు
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





