60 ఏళ్ల వృద్ధుడిలో కామ కోరికలు చావలేదు. భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోగా.. గ్రామంలోని ఆడాళ్లపై కన్నేశాడు. మహిళల మానం తీసే ఇలాంటి వాడిని మట్టిలో కనిపేయాలని భావించిన బాధితులు అతన్ని బతికుండానే నిప్పు పెట్టి కాల్చేశారు.
60 ఏళ్ల వృద్ధుడు… నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయింది. కృష్ణారామా అనుకుంటూ ఉండక కామాకోరికలతో రెచ్చిపోయాడు. ఊళ్లో కనిపించిన అమాయకపు మహిళలను వేధింపులకు గురిచేసి లైంగికంగా అనుభవించాడు. మహిళల మానం తీసే ఇలాంటి వాడిని మట్టిలో కలిపేయాలని ఆరుగురు బాధితులు నిర్ణయం తీసుకున్నారు. మరికొంతమందితో కలిసి నేరుగా ఆ కామాంధుడి ఇంటికి వెళ్లి నచ్చినట్లుగా కొట్టి బతుకుండగానే తగలబెట్టేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఒడశాలో చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అయితే అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న అతనిలో కామాంధుడు బయటకు లేచాడు. ఊళ్లో కనిపించిన ప్రతీ మహిళపై కన్నేసి అనుభవించాలని అనుకునేవాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు వారి దగ్గర కామాన్ని చూపించేవాడు. ఇష్టం వచ్చినట్లుగా అసభ్యంగా ఎక్కడపడితే అక్కడ తాకేవాడు. అర్థరాత్రుళ్లు ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారని తెలిస్తే చాలు అక్కడికెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఐదుగురి మహిళలను అనుభవించాడు. పరువు పోతుందని బాధితులు లోలోపలే బాధను దాచుకున్నారు. జూన్ 03వ తేదీన ఓ 52 ఏళ్ల ఓ వివాహితపై కూడా ఈ కామ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం మిగితా బాధితులకు కూడా తెలియడంతో అతన్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నేరుగా నిందితుడి ఇంటికి వెళ్లి అతనిపై దాడికి దిగారు. ఒళ్లంతా కుళ్లబొడిచారు. అంతా కలిసి అతడిని తమ గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఓ చెట్టుకు కట్టేసి బతకుండగానే నిప్పు పెట్టి మరి చంపేశారు. మృతుడి జాడ కనిపించకుండా పోవడంతో కుటంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఇదంతా బయటపడింది. విచారణలో బాధిత మహిళలు నిజాన్ని ఒప్పుకున్నారు. హత్య చేసిన ఆరుగురు మహిళలు సహా వారికి సహకరించిన మరో ఇద్దరు మహిళలు, పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!