హత్యకు గురైన పిచ్చి ప్రేమికుడు
ప్రియురాలి ప్రేమ దక్కించుకోవడానికి ఇద్దరు యువకులు పోటీపడి చివరకు హత్యకు గురయ్యాడో పిచ్చి ప్రేమికుడు. స్నేహితుడు అని కూడా చూడకుండా ప్రియురాలిని దక్కించుకోవడానికి ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్, జూన్ 9: ఒక మనిషి ప్రాణం తీయడమనేది సాధారణ విషయం కాదు.. అలాంటిది మరో మనిషి కోసం విచక్షణ మరిచి హత్యలు, ఖూనీలు చేసేవరకు దిగజారిపోతున్నామంటే నానాటికీ సమాజం ఏ దారిన వెళ్తుందో ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ చాదర్‌ఘాట్ పరిధిలో కలకలం రేపింది.
హైదరాబాద్ నగరం పాతబస్తీ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (జూన్ 7) సాయంత్రం ఖుదుష్ (30) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఓ యువతి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణే ఈ దారుణ ఘటనకు కారణంగా తెలిసింది. హతుడు, నిందితుడు ఇద్దరూ రాజస్థాన్ రాష్ట్రంకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం రాజస్థాన్ నుంచి ఆ యువకులు హైదరాబాద్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పైగా బక్రీద్ పర్వదినం రోజున ఈ సంఘటన జరగడంతో పాతబస్తీ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్.చైతన్య కుమార్ ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్! 12 రాశులకు వారఫలాలు
- Telangana: ఫోన్కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!
- నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?





