అల్లూరి జిల్లా అరకు లోయలోని ఏజెన్సీ ప్రాంతంలోని డుంబ్రిగూడ మండలం గుంటసీమ దగ్గర కొంతమంది బాలురు ఈతకు వెళ్లారు. అయితే చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండటం, లోతు కూడా ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి చనిపోయారు
AP Crime : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. వేసవిసెలవులు కావడంతో చాలామంది సరదాగా ఈతకోసమని చెరువులు, నదులను ఆశ్రయిస్తున్నారు. అయితే సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల సరదా కాస్తా విషాదంగా మారుతోంది. అల్లూరి జిల్లాలోనూ సరదాగా చెరువులో ఈత కొడుతూ నలుగురు బాలురు నీటిలో మునిగి గల్లంతయ్యారు.
4 Boys Missing While Swimming
అల్లూరి జిల్లా అరకు లోయలోని ఏజెన్సీ ప్రాంతంలోని డుంబ్రిగూడ మండలం గుంటసీమ దగ్గర కొంతమంది బాలురు ఈతకు వెళ్లారు. అయితే చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండటం, లోతు కూడా ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద సంఘటనతో నాలుగు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి
కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ బాలురు ఒంటరిగా వెళ్లారా? ఎవరైనా తోడుగా వెళ్లారా? వారికి ఈత వస్తుందా రాదా అనే విషయాలపై క్లారిటీ రావలసి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!