ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్యాంపు ఏరియాలో అర్దరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయలరాము మద్యం మత్తులో పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పై చేయి చేసుకున్నాడు.
TG Crime: ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్యాంపు ఏరియాలో అర్దరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయలరాము మద్యం మత్తులో పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. హోటల్ సిబ్బందికి రాముకు మధ్య గొడవ ముదరడంతో రాము తన అనుచరులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తల్లాడ నుంచి కల్లూరుకు భారీగా చేరుకున్న రాము అనుచరులు హల్‌చల్ చేశారు.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదరడంతో ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మహిలా ఎస్సై హరిత తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారు వినకపోవడంతో పాటు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ నేత రాయలు రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు
కాగా గొడవ సద్దుమనగక పోవడంతో రామును స్టేషన్ కు తరలిస్తుండగా రాము అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. తీవ్ర అసహనంతో మహిళాఎస్సై హరిత రాముపై చేయి చేసుకుంది. దీంతో మరింత రెచ్చిపోయిన రాము మహిళా ఎస్సైని తోసేశాడు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోచుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాయలరాముతో పాటు ఆయన అనుచరులు ఐదుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా రాము మహిళా ఎస్సై పై చేయి చేసుకోవడాన్ని పలువురు ఖండించారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





