ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. తిరుపతిలో ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతోంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లో పలువురు యువకులు డ్రగ్స్ తీసుకుంటుండగా ఫోటోలు తీశారు. స్వయంగా మత్తు ఇంజక్షన్లు యువత వేసుకుంటున్నారు.
Drug injections: తిరుపతిలో మత్తు పదార్థాల వినియోగం కలకలం రేపింది. ఇంద్ర ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో మత్తు ఇంజక్షన్లను స్వయంగా తీసుకుంటున్న యువకుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసివారు ఆందోళనకు గురతున్నారు. మార్కెట్ చుట్టుపక్కల తరచూ మత్తులో ఉండే యువకులు చూసి భయ పడుతున్నారు. ప్రజలు షాపింగ్ చేసేందుకు వచ్చేటప్పుడు ఈ దృశ్యాలు చూసి ఆందోళన పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఫోటోలలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. కొంతమంది యువకులు నేరుగా వీధుల్లోనే ఇంజక్షన్లు వేస్తూ కనిపించారు. మత్తు వలన హావభావాలు మారిపోయిన వారిని చూస్తే చలించిపోతున్నారు. వీటిని చిత్రీకరించిన కొంతమంది యువకులు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అవి వైరల్ అయ్యాయి. ఇది తిరుపతి నగరంలో కొనసాగుతున్న మత్తు దందా అని స్థానికులు చెబుతున్నారు.
తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు..
తిరుపతి వంటి పవిత్రమైన నగరంలో మత్తు పదార్థాల వ్యసనాలు ఇంత తీవ్రంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. యువత మత్తులోకి జారిపోవడానికి పలు సామాజిక, ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయ అనే విషయం తెలియాల్సి ఉంది. కుటుంబంలో సమస్యలు, నిరుద్యోగం, స్నేహితుల ప్రభావం వంటి అంశాలు ఈ మార్గంలోకి దారి తీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు, ఆరోగ్య, స్థానిక సంస్థలు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు అంటున్నారు.
ఇలాంటివి పట్టించుకోకపోతే తిరుపతిలో ఇలాంటి దారుణాలు ఎక్కువ అవుతాయంటున్నారు. తిరుపతి నగరం యొక్క గౌరవాన్ని కాపాడేందుకు స్థానిక ప్రజలు.. అధికార యంత్రాంగం సంయుక్తంగా పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. మత్తు వ్యసనాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెంటర్లు, విద్యా సంస్థల్లో నిషేధిత పదార్థాలపై చట్టపరమైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందటున్నారు. యువతను మాయలోకి లాగుతున్న ఈ మత్తు పదార్థాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకోని… తిరుపతిలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండ చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!
- నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ నియమాలు పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు!
- రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..





