ఎన్ టి ఆర్ జిల్లా :– 
వైసిపి వెన్నుపోటు దినోత్సవం కు నిరసనగా….
తిరువూరు లో టిడిపి ఆధ్వర్యంలో  విమోచన దినోత్సవం.
ఈ సందర్బంగా  జరిగిన విలేకరుల సమావేశంలో…
 తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ…
రాష్ట్రం లో విధ్వంస పాలన పోయి అత్యధిక మెజారిటీ తో   చంద్రబాబు నేత్రుత్వం లో కూటమి ప్రభుత్వం రికార్డు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన రోజును….
అసెంబ్లీ కి రాకుండా, రాష్ట్రం లో ఉండకుండా పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటూ విజిటింగ్ ప్రొఫెసర్లా వస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన జగన్ మోహన్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేయటం సిగ్గు చేటన్నారు.
చంద్రబాబు పాలన అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ రాజకీయం, నరేంద్ర మోడీ అభివృద్ది మంత్రం తో రాష్ట్రం లో 5 సంవత్సరాల  పాటు ప్రజలకు పట్టిన పీడ విరగడైన….
ఈ జూన్ 4  ఓ చారిత్రాత్మక దినం అన్నారు ఎమ్మెల్యే  కొలికపూడి.
చంద్రబాబు గారి నాయకత్వం లో అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పోలవరం నిర్మాణం పరుగు లెత్తటం, రాయలసీమ ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపనకు ఒప్పందం లా ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం, ee సంవత్సర కాలం లో వృద్ధుల పెన్షన్ 4000 వేలకు, వికలాంగుల పెన్షన్ 6000, 10వేలు, 15,వేలు ఇవ్వటం..
అలాగే నిరుద్యోగులకు అనేక పరిక్షలకు సంభందించి నోటిఫికేషన్ లు…
ఈ విధంగా  చంద్రబాబు నాయకత్వం లో సంక్షేమం అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుంటే…..
 తట్టుకోలేని  జగన్ మోహన్ రెడ్డి  వెన్నుపోటు దినోత్సవం పేరుతో  పార్టీ శ్రేణులకు  పిలుపు ఇవ్వటం జగన్ మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని కొలికిపూడి విమర్శించారు.
ఇప్పటి కైనా జగన్ మోహన్ రెడ్డి రాష్టం లో ఆరాచకం సృష్టించే రాజాకీయాలు గాకుండా, విలువలతో కూడిన సలహాలు, సూచనలు అందించి రాష్ట్రాభి వృద్ధికి సహకరించాలని కొలికపూడి కోరారు.
ఈ కార్యక్రమం లో నియోజకవర్గ,  మండల, పట్టణ  కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





