ముఠాలోని నిందితులంతా దాదాపు మహిళలే. అందరూ ఏదో ఒక పనిచేసుకుంటూనే.. పిల్లల అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ ముఠాలోని ఒక్కొక్కరు ఒక్కో పనిచేస్తారు. వ్యాపారం పేరుతో ఊరూరా తిరుగుతూ పిల్లలు లేని తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత వాళ్లకు వలేసి.. పిల్లలను విక్రయిస్తారు.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంగా శిశు విక్రయ ముఠా గుట్టురట్టయ్యింది. 13మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. నిందితుల నుంచి ఏడుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలను రక్షించారు. మూడేళ్లలో 28మంది పిల్లలను అక్రమంగా రవాణాచేసి విక్రయించినట్టు గుర్తించారు. మహారాష్ట్ర, గుజరాత్లో తక్కువ ధరకు కొనుగోలుచేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు రూ.10లక్షలకు విక్రయించినట్టు గుర్తించారు.
శిశువుల అక్రమ దత్తత.. విక్రయ ముఠాపై పక్కా సమాచారం రావడంతో టేకుమట్లలో అంజయ్య, నాగయ్య దంపతులను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్లను విచారిస్తే.. డొంక మొత్తం కదిలింది. వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా సూర్యాపేటలో నక్క యాదగిరి, ఉమారాణి దంపతులను అరెస్ట్ చేశారు. వీళ్లిచ్చిన సమాచారం ఆధారంగా సూర్యాపేట బస్టాండ్లో మరికొందర్ని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
నిందితుల్లో ఎక్కువమంది హైదరాబాద్, విజయవాడ, నాగర్కర్నూల్ వాసులు ఉన్నారంటున్నారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ.. శిశువుల అక్రమ రవాణా వ్యాపారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టమని పేర్కొన్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




