Daughter Marriage: అర్పిత గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వాళ్లను కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అర్పిత ఇళ్లు వదిలి వెళ్లిపోవటంతో మహదేవస్వామి, మంజుల, హర్షిత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు.
ఈ సృష్టిలో అత్యంత విలువైనది ప్రేమ. యుద్ధంలో వేల మంది ప్రాణాలు తీసే క్రూరుడైనా.. ప్రేమించిన మనిషి కోసం కన్నీళ్లు పెట్టుకోకమానడు. రాయి లాంటి మనసునైనా.. మొత్తని దూదిలా చేయగల సత్తా ప్రేమకు మాత్రమే ఉంది. అందుకే ప్రేమ కోసం చావడానికైనా.. చంపడానికైనా ప్రేమికులు సిద్ధంగా ఉంటారు.
ప్రేమికులకు సమాజం నుంచి కంటే కుటుంబం నుంచే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లల భవిష్యత్తు.. కులాలు, మతాల గురించి ఆలోచించి పెద్దలు పెళ్లికి నో చెబుతూ ఉంటారు. అయితే, కొంతమంది పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.
కొందరు అమ్మాయిలు ప్రేమించిన వాడి కోసం ఇళ్లు వదిలి పారిపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ అమ్మాయి కూడా ప్రేమించిన వాడికోసం ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. అదే వారి కుటుంబానికి శాపంగా మారింది. కూతురు చేసిన పనిని అవమానంగా భావించి.. ముగ్గరు కుటుంబసభ్యులు ప్రాణాలు తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మైసూరుకు చెందిన మహదేవస్వామి, మంజుల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు అమ్మాయిలు అర్పిత, హర్షిత ఉన్నారు.
అర్పిత గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వాళ్లను కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అర్పిత ఇళ్లు వదిలి వెళ్లిపోవటంతో మహదేవస్వామి, మంజుల, హర్షిత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ రోజు హెచ్ఎ కోటెలోని బుదనూర్ లేక్లో దూకి ప్రాణాలు తీసుకున్నారు. వీరు ముగ్గురు లేక్ దగ్గరకు వెళుతుండగా కొంతమంది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికే దారుణం జరిగిపోయింది. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వారు ముగ్గురు నడుముకు తాళ్లు కట్టుకుని నీటిలోకి దూకటం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





