తెలంగాణలో మరో గురుమార్తి తరహా ఘటన సంచలనం రేపింది. నిజమాబాద్ ఆర్మూర్‌కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో మరో గురుమార్తి తరహా ఘటన సంచలనం రేపింది. నిజమాబాద్ ఆర్మూర్‌కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. రెంజర్ల మండలానికి చెందిన ముద్దంగుల గంగాధర్‌కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన అంజలి(35)తో 18 ఏళ్ల పెళ్లైంది. వీరికి స్పందన, ఇందు అనే ఆడపిల్లలున్నారు. అయితే గత రెండేళ్ల క్రితం గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వీరు.. బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు.
గంగాధర్ ఉపాధికోసం దుబాయ్ వెళ్లగా.. అంజలి పిల్లలతో కలిసి ఆర్మూర్‌లో ఉంటోంది. గత నెలలో ఇంటికి తిరిగొచ్చిన గంగాధర్.. విడాకుల కోసం అంజలిని బోధన్ కోర్టుకు రావాలని పిలిచాడు. కానీ నిజమాబాద్ లోనే గంగాధర్ తో గొడవపడిన అంజలి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి ఆర్మూర్‌లోని తను ఉండే ఇంటికి వెళ్లిపోయింది. అయితే తనవెంటే ఆ ఇంటికొచ్చాడు గంగాధర్. అక్కడ ఇరువురికి వివాదం జరగగా.. ఇంట్లో ఉండే కత్తితో అంజలి గొంతు కోసేశాడు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు ఇంట్లోనే ఉన్న పిల్లలు.. వద్దు నాన్న అంటూ వేడుకున్న వినలేదు. అంజలి చనిపోగానే పారిపోతుండగా స్థానికులు పోలీసులకు పట్టించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ తెలిపారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





