ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్‌కు లీక్ చేసిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గురుదాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్‌లు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ కదలికలు, ప్లాన్ లు పాక్ నిఘా సంస్థకు అందించారు.
పాకిస్థాస్కు ఇండియన్ ఆర్మీ రహస్యాలు చేరవేసే మరో గూఢచార నెట్వర్క్ గుట్టు బయటపడింది. ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్‌కు లీక్ చేసిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు కీలక సమాచారాన్ని లీక్ చేశారు. నిందితులను గురుదాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్‌గా గుర్తించారు.
ఇద్దరు యువకులు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలతోపాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ కదలికలు, జాతీయ భద్రతా వ్యూహాత్మక ప్రదేశాల సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు అందించారని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు. నిఘా సంస్థల సమాచారం ఆధారంగా వారి మొబైల్ ఫోన్లు చెక్ చేస్తే పాక్‌కు గూఢచర్యం వహిస్తున్నట్లుగా నిర్ధారణ అయ్యిందన్నారు. నిందితులైన యువకులు డ్రగ్స్‌కు బానిస అయ్యారని అన్నారు.
3 మొబైల్ ఫోన్లు, 8 లైవ్ కార్ట్రిడ్జ్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లకు రూ. లక్ష ట్రాన్సర్ అయ్యిందని తెలుస్తోంది. గత 20 రోజులుగా పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. గురుదాస్‌పూర్ పోలీసులు దీనిని ఛేదించారని తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Alao read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో