ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుప్పం మండలం దేవరాజపురంలో నీటిగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు స్థానికంగా నివసించే గౌతమి(7), షాలిని(6), అశ్విన్(7) తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణం కోసం తీసిన పునాధి గుంతలోకి నీరు చేరగా.. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు ఈ నీటిలో పడి చనిపోయినట్టు తెలుస్తోంది.
ఆడుకుంటూ నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన ముగ్గురు చిన్నారులు గౌతమి(7), షాలిని(6), అశ్విన్(7) వారు నివసిస్తున్న ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఆ పక్కనే ఇంటి నిర్మాణం కోసం తీసిన ఓ ఫునాధి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఆ పునాధి గుంతలోకి భారీగా నీరు చేరాయి. ఈ క్రమంలో దాని పక్కనే ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు ఆ నీటి గుంతలో పడిపోయారు. ఉపిరిరాకడ నీటిలోనే మునిగి ప్రాణాలు విడిచారు.
ఇక గుంతలో చిన్నారులను గమనించిన స్థానికులను వారిని హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు తెలిపారు. దీంతో ఆ ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు ముగ్గురు చిన్నారుల మృతితో దేవరాజపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా విజయనగరంలో కూడా ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారులో ఆడుకుంటూ ఉండగా లాక్ పడి ఊపిరాడక మృతి చెందారు. ఇలా రాష్ట్రంలో ఒకే రోజు వరుస విషాదాలు నెలకొనడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓకే రోజు ఏడుగురు చిన్నారులు మృతి చెందండం రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపింది
Also read
- పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!
- విష్ణుమూర్తి ప్రసన్నం కావాలా? గురువారం ఈ 5 పనులు తప్పక చేయండి.. సిరిసంపదలు ఖాయం!
- గాయత్రీ మంత్రం శక్తి ఇదే.. రోజూ జపిస్తే కష్టాలు దూరమై ఐశ్వర్యం పెరుగుతుందట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- భార్య గొంతు కోసి చంపేశాడు





