అప్పటివరకు కళ్ల ముందే ఆడుకుంటున్నారు.. సంతోషంగా గెంతులేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. నాలుగు ప్రాణాలు దక్కేవి.. సరదాగా.. ఆగివున్న కారులో ఆడుకునేందుకు వెళ్లి నలుగురు చిన్నారులు చనిపోయారు.. చిన్నారులు ఆడుకుంటుండగా.. ఆటోమెటిక్‌గా డోర్‌లాక్ పడి పోవడంతో ఊపిరి ఆడక చిన్నారులు విలవిలలాడుతూ కన్నుమూశారు.. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో చోటుచేసుకుంది. కారు లాక్ పడటంలో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు చిన్నారులు ఆదివారం ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు.. ఆ తర్వాత ఎంతసేపైనా తిరిగి రాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు.. ఎంత వెతికినా వారు కనిపించలేదు. చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద.. ఆగి ఉన్న కారులో పరిశీలించారు.. దానిలో నలుగురు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. ఆ తర్వాత చిన్నారులను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.. మృతులను ఉదయ్ (8), చారుమతి (8), చరిష్మా (6), మనస్విగా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లని స్థానికులు తెలిపారు.
కాగా.. గ్రామంలో ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు