మొన్నటివరకు అదొక సాదాసీదా జైలు. చిన్నచిన్న నేరాలు చేసేవారిని.. సామాన్యులను ఆ జైల్లో పెట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. విజయవాడ సబ్‌జైలుకు వీఐపీల తాకిడి పెరిగింది. ఒకప్పుడు రాజకీయంగా వెలుగు వెలిగిన వారు.. అధికార యంత్రాంగాన్ని అంతా కంట్రోల్ చేసినవారు ఆ జైల్లో ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నెలల క్రితం వరకు రాజమండ్రి సెంట్రల్ జైలే ఫేమస్.. కానీ ఇప్పుడు విజయవాడ సబ్ జైలు చాలా ఫేమస్ అయింది. కీలక కేసుల్లో నిందుతలంతా ఈ సబ్ జైలులోనే ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో కృష్ణాజిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వల్లభేనేని వంశీ మూడు నెలలుగా విజయవాడ జైలులోనే ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ వచ్చినప్పటికీ భూ కబ్జా కేసులో జైలు జీవితం గడుపుతున్నారు వంశీ.
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఏడుగురు విజయవాడ కారాగారంలోనే ఉన్నారు. మాజీ సీఎం జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఈ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప, కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య ఇదే జైలులో ఉన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షా పత్రాల డిజిటల్ కరెక్షన్ కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరితో ములాఖత్ అయ్యేందుకు విజయవాడ సబ్ జైలుకు వీఐపీల తాకిడి పెరగడంతో భద్రత కట్టుదిట్టం చేశారు జైలు అధికారులు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025